దేశంలో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ పెట్టడం వల్ల కరోనా కేసులు చాలా వరకూ తగ్గుముఖం పట్టాయి.. రోజుకి మూడులక్షలు దాటిన కేసులు ఇప్పుడు రోజుకి లక్ష కేసులకు నమోదు అవుతున్నాయి….అయితే చాలా రాష్ట్రాల్లో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది, ఓ పక్క కరోనా టీకా ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోంది.. ఇక తమిళనాడులో ఎన్నికల తర్వాత ఇక్కడ కరోనా పాజిటీవ్ కేసులు వేగంగా పెరిగాయి. దీంతో కఠిన లాక్ డౌన్ అమలు అవుతోంది.
స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు, అయితే కేసులు ఇంకా కొన్ని ప్రాంతాల్లో తగ్గడం లేదు. దీంతో తమిళనాడు ప్రభుత్వం లాక్ డౌన్ ను మరో వారం పొడిగించింది. కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు నియంత్రణలోకి వచ్చాయి, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం కేసులు ఇంకా తగ్గలేదు. దీంతో లాక్ డౌన్ ను జూన్ 14 వరకు పొడిగిస్తున్నట్టు స్టాలిన్ సర్కార్ ప్రకటించింది.
ఈ సమయంలో ప్రజలకు ఊరట ఏమిటి అంటే చెన్నైకి మరిన్ని సడలింపులను ఇస్తున్నట్టు తెలిపారు.
కిరాణా దుకాణాలు, కూరగాయలు, మాంసం, చేపల మార్కెట్లను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనుమతించారు. ఇక సర్కారు కార్యాలయాల్లో 30 శాతం మంది సిబ్బందికి అనుమతి ఇచ్చారు. రోజుకి 50 టోకెన్లు ఇచ్చి రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇచ్చారు.. నీలగిరులు, కొడైకెనాల్, ఎర్కాడ్, ఎళగిరి, కోర్తాలాలలో కేసులు ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ ఇక్కడకు ఎవరైనా వెళ్లాలి అంటే కచ్చింగా ఈపాస్ తీసుకోవాలి.