లాక్ డౌన్ వేళ ఈ అన్నదమ్ములిద్దరూ ఏం చేస్తున్నారో తెలుసా ?

లాక్ డౌన్ వేళ ఈ అన్నదమ్ములిద్దరూ ఏం చేస్తున్నారో తెలుసా ?

0
34

లాక్ డౌన్ వేళ చాలా మంది పేదలు ఆకలితో అలమటిస్తున్నారు, ఈ సమయంలో లక్షలాది మంది పేదల కడుపు నింపుతున్నారు చాలా మంది, ఆకలితో ఉన్నవారికి సాయం చేస్తున్నారు, ఇక వారిదగ్గర ఉన్ననగదుతో నిత్యఅవసరాల సరుకులు కూరగాయలు కూడా అందిస్తున్నారు.

కర్ణాటకలోని ప్రసిద్ధ కోలార్ ప్రాంతం కూడా కరోనా ధాటికి స్తంభించిపోయింది. దాంతో అక్కడి కార్మికులు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఇక్కడ తాజమ్ముల్ పాషా, ముజామ్మిల్ పాషా అనే ఇద్దరు సోదరులు తమ భూమిని రూ.25 లక్షలకు అమ్మేసి, ఆ డబ్బుతో పేదలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.

దీంతో అందరూ వారిని ఎంతో పొగుడుతున్నారు, ఇంత మంచి మనసుతో వారు చేస్తున్న సేవని అందరూ కీర్తిస్తున్నారు..
వేలాదిమందికి సరుకులు అన్నదానం చేస్తున్నారు. అంతేకాదు వారి ఇంటికి సమీపంలో నూనెలు సరుకులు పేదలకు పంచిపెడుతున్నారు. ఇంటిపక్కన చిన్న వంటశాల పెట్టి పేదలకు అన్నం వండి పెడుతున్నారు.

కోలార్ కు చెందిన ఈ పాషా బ్రదర్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు అరటి పంట సాగు చేస్తుంటారు. లాక్ డౌన్ నేపథ్యంలో వేలమంది కష్టాల్లో చిక్కుకోవడంతో తమ భూమిని అమ్మేశారు. నిజంగా వీరు చేస్తున్న సాయానికి అందరూ వీరికి సలాం చేస్తున్నారు.