జగన్ పాదయాత్ర చేసింది అందుకా… అధికారం కోసం కాదా

జగన్ పాదయాత్ర చేసింది అందుకా... అధికారం కోసం కాదా

0
97

మిషన్ క్విడ్ ప్రో కో మళ్ళీ ప్రారంభమయ్యిందని టీడీపీ మాజీ మంత్రిలోకేశ్ అన్నారు… జగన్ మోహన్ రెడ్డి యువకుడుగా ఉండి రోజుకి మూడు కిలోమీటర్లు మాత్రమే పాదయాత్ర చేస్తుంటే, అప్పుడే తనకు అనుమానం వచ్చిందని లోకేశ్ అన్నారు.

అయితే ఇప్పుడు తన అనుమానం నిజమైందని లోకేశ్ తెలిపారు. పాదయాత్రలో భాగంగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ స్థలాల సర్వే పూర్తి చేసారని ఆరోపించారు

విలువైన ప్రభుత్వ ఆస్తులు అప్పనంగా కొట్టేయడానికి జగన్ అండ్ క్విడ్ ప్రో కో కంపెనీ స్కెచ్ వేసిందని ఆరోపించారు. వాలంటీర్ల పేరుతో ఒకవైపు సంవత్సరానికి రూ.4 వేల కోట్ల ప్రజాధనాన్ని దోపిడీ చేస్తూ, మరోవైపు పథకాల కోసం ప్రభుత్వ ఆస్తులు అమ్మేస్తాం అంటే ఊరుకోమని లోకేశ్ హెచ్చారించారు