జగన్ ను ఓ ఆట ఆడుకుంటున్న లోకేశ్

జగన్ ను ఓ ఆట ఆడుకుంటున్న లోకేశ్

0
86

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, మంత్రులు ఎమ్మెల్యేలకు దమ్ముంటే ప్రస్తుతం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పండని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు.

టీడీపీ నేతలు అడుగుతున్న ప్రశ్నలకు చేతగాని దద్దమ్మల్లా కేసులు పెట్టి పారిపోకండని లోకేశ్ హెచ్చరించారు. ప్రజా సమస్యలు పరిష్కరించే సత్తా లేక మా నాయకుల ప్రెస్ మీట్లపై కులమతాల పేరుతో కేసులు పెడతారా? ఇది కాదా తుగ్లక్ చర్య అంటే అని లోకేశ్ ఎద్దేవా చేశారు

వైసీపీ పాలనలో పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని అన్నందుకే అయ్యన్నపాత్రుడుపై వైసీపీ నాయకులు కేసులు పెడితే, ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రిని నడిరోడ్డుమీద కాల్చి చంపాలి అని అన్న మిమ్మల్ని ఏం చెయ్యాలని ప్రశ్నించారు ఉరి తియ్యాలా అని లోకేశ్ అన్నారు