జగన్ ను సూటిగా సుత్తిలేకుండా ప్రశ్నించిన లోకేశ్

జగన్ ను సూటిగా సుత్తిలేకుండా ప్రశ్నించిన లోకేశ్

0
86

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన వైఎస్ రైతుభరోసా పథకంపై టీడీపీ నాయకులు తమ అభ్యంతరాలు తెలుపుతున్నారు.. ఇదే క్రమంలో మాజీ మంత్రి నారాలోకేశ్ కూడా స్పందించారు… వాయిదా పద్ధతి జగన్, మీరు ప్రవేశపెట్టింది వైఎస్ఆర్ రైతునిరాశ కార్యక్రమం అని ఎద్దేవా చేశారు..

ఎన్నికల హామీలో రైతుభరోసా కింద రూ.12,500 ఇస్తామని ప్రకటించి ఇప్పుడు కేవలం రూ.7,500 ఇస్తూ రైతులకూ రివర్స్ టెండరేశారు ఆరోపించారు. 64 లక్షలమంది రైతుల్లో సగం మందిని తగ్గించుకుంటూ పోయారని లోకేశ్ మండిపడ్డారు.

అలాగే కులాన్ని చూడము అంటూనే ఓసీలైన కౌలు రైతులకు మొండిచెయ్యి చూపారు. పెట్టుబడి సాయం ఒకేసారి ఇస్తామని మాటిచ్చి విడతల్లో ఇస్తూ మడమ తిప్పారు. మీ పార్టీ వాలంటీర్లకి నెలకు రూ.8000 ఇస్తూ.. ఆరుగాలం శ్రమించే అన్నదాతకు మాత్రం రూ.625 ఇవ్వడం న్యాయమా అని ప్రశ్నించారు లోకేశ్