వైసీపీ ఫ్యాన్స్ కు లోకేశ్ భారీ కౌంటర్…

వైసీపీ ఫ్యాన్స్ కు లోకేశ్ భారీ కౌంటర్...

0
91

వైసీపీ ఫ్యాన్స్ కు లోకేశ్ భారీ కౌంటర్…

నిన్న పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా దెందులూరులో కార్యకర్తలను, అభిమానులను కలిసిన లోకేశ్ ఆ తర్వాత ఏలూరు సబ్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే చింతమనేనిని కలిశారు… ఆయనకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చివచ్చిన సంగతి తెలిసిందే…

దీని గురించి సోషల్ మీడియాలో ఒక వార్త హల్ చల్ చేస్తోంది.. చింతమనేని మరామర్శించేందుకు వచ్చిన ఆయన పోలీస్ అధికారులు భోజనం ఏర్పాట్లు చేయలేదని… 24 గంటలు తిండి ద్యాసే లోకేశ్ పర్ఫామేన్స్ అంటు సోషల్ మీడియలో పోస్ట్ వైరల్ అవుతోంది.

దీనిపై లోకేశ్ కౌంటర్ ఇచ్చారు… పేటిఎం చిల్లర కోసం ఎంతకైనా దిగజారి చిల్లర పోస్టులు పెట్టే వాళ్ళకి ఇంతకన్నా సంస్కారవంతమైన, ప్రయోజనకరమైన ఆలోచనలు వస్తాయని నేననుకోనని కౌంటర్ ఇచ్చారు. అయినా అది వాళ్ళ తప్పుకాదు. వాళ్ళ నాయకుని చరిత్ర అలాంటిదని ఆరోపించారు. వాళ్ళ నాయకుడికి కాసుల కక్కుర్తి ఉండబట్టే వేల కోట్ల అవినీతికి పాల్పడి జైలు కూడు తినొచ్చారు. ఆ రోజుల్లో భోజనం ఏర్పాట్ల గురించి బహుశా ఆయన అలా గొడవ పడ్డారేమో అని లోకేశ్ కౌంటర్ ఇచ్చారు.