లోకేశ్ డిమాండ్ ను సీఎం జగన్ నెరవేర్చుతారా…

లోకేశ్ డిమాండ్ ను సీఎం జగన్ నెరవేర్చుతారా...

0
114

సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని ఆదుకోవాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టీడీపీ నేత నారా లోకేశ్ మరోసారి లేఖ రాశారు… టీడీపీ హయాంలో చేనేత సహకార సంఘంలో ఉన్న వారికి ఒక్కో బారుకు రూ.1,000 వరకు ప్రోత్సాహకం ఉండేదని గుర్తు చేశారు. ఏటా 50 వేల రూపాయల వరకు ప్రోత్సాహకం అందేదని అన్నారు..

10 శాతం ఉన్న నూలు సబ్సిడీని 40 శాతానికి పెంచిందని అన్నారు. ఏడాదిలో 150 రోజులు మాత్రమే రిబేటులు అమ్ముకునే అవకాశాన్ని 365 రోజులకు పెంచిందని తెలిపారు. చేనేత సహకార సంఘాలకు పావలా వడ్డీ రాయితీ అమలు చేసిందని గుర్తు చేశారు… అయితే వైసీపీ అధికారంలోకొచ్చాక ఇవన్నీ ఆగిపోయాయని మండిపడ్డారు లోకేశ్

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎత్తేసిన సంక్షేమ కార్యక్రమాలు అన్నీ అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు లోకేశ్… ఆటవిడుపు మాటలతో సరిపెట్టకుండా, త్వరితగతిన చేనేత రంగాన్ని ఆదుకోవాలని అన్నారు… చేనేత కళాకారులకు అండగా నిలబడాలని అన్నారు…