మాజీ మంత్రి నారా లోకేశ్ ప్రతీ రోజు కార్యకర్తలను అలాగే పార్టీ నేతలను కలుస్తూ బిజీ షెడ్యూల్ లో ఉంటారు… అలాగే వైసీపీ ప్రభుత్వంపై కన్నెర్ర చేస్తూ ట్విట్టర్ వేదికగా విమర్శలు సందిస్తుంటారు… దీనితో పాటు తనకు ఎదురైన విషయాలను కూడా ట్విట్టర్ ద్వారా పంచుకుంటారు…
అయితే ఇదేక్రమంలో జైల్లో ఉన్నటీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను కలిశారు లోకేశ్… ఆయనను కలిసి దైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చి వచ్చారు… ఈ విషయాన్ని తన అభిమానుతో పంచుకున్నారు లోకేశ్…
ఈరోజు తాను పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన సందర్భంగా, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ని ఏలూరు సబ్ జైలు వద్ద పరామర్శించానని తెలిపారు. వైసీపీ ఎన్ని వేధింపులకు గురిచేస్తున్నా, ధైర్యంతో ఎదుర్కొంటున్న వారికి పార్టీ తరపున పూర్తి సహకారం ఉంటుందని, న్యాయపోరాటం చేద్దామని భరోసా ఇచ్చానని తెలిపారు.
అలాగే టీడీపీ హయాంలో ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టి ప్రజలకు, కార్మికులకు ఇబ్బందులు లేకుండా చేస్తే, నేడు జగన్ ప్రభుత్వం కొత్తపాలసీ పేరుతో ప్రజలను లూటీ చేస్తోందని ట్వీట్ చేశారు. దానికి తోడు వారి ఇసుక మాఫియా బ్లాక్ మార్కెట్ లో కోట్లు కొల్లగొడుతూ, కార్మికుల కుటుంబాలను కూల్చుతోందని మండిపడ్డారు….