జగన్ చేసిన మిస్టేక్ ను కనిపెట్టిన లోకేశ్

జగన్ చేసిన మిస్టేక్ ను కనిపెట్టిన లోకేశ్

0
103

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్టాండ్ అప్ కామెడీ అదిరిపోయిందని లోకేశ్ అన్నారు… అవినీతికి అమ్మా, నాన్న కూడా తానే అయిన జగన్ మోహన్ రెడ్డి అవినీతిని నిర్ములిస్తా అని స్టేట్ మెంట్ ఇవ్వడం కన్నా ఘోరం ఇంకోటి ఉంటుందా అని లోకేశ్ ప్రశ్నించారు…

జగన్ అవినీతి పై ప్రపంచంలో ఉన్న ఉత్తమ సంస్థలు, యూనివర్సిటీలు అధ్యయనం చేసి, ఆయన అవినీతి కీర్తి గురించి ప్రపంచ దేశాల్లో కేస్ స్టడీగా చెబుతుంటే… ఆయన రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పై అధ్యయనం చేయిస్తానని అనడం ఏంటి కామెడీ అని అన్నారు

అంతా బ్రహ్మాండంగా ప్లాన్ చేసారు పబ్లిసిటీ పీక్స్ కి వెళ్లిందని లోకేశ్ ఆరోపించారు కానీ చిన్న తప్పు చేసి దొరికిపోయారని తెలిపారు. ”మా నాన్న నిజాయితీపరుడు, మరి మీ నాన్న?” అని ఉన్న ప్లకార్డుని పక్కనున్న అధికారితో పట్టించిన జగన్ తాను పట్టుకునే ధైర్యం చేయలేకపోయారని లోకేశ్ ఎద్దేవా చేశారు…