రాజధానిలో రైతుల ఆందోళనలు మిన్నంటాయి అనేది తెలిసిందే, ఇటీవల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆయన సతీమణి కూడా అక్కడ రైతులతో పాటు దీక్షలో కూర్చున్నారు, ఈ సమయంలో అమరావతి రైతుల కోసం తన రెండు బంగారు గాజులను విరాళంగా ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి.
అయితే ఈ సంఘటనపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు, దీనిపై ఎమ్మెల్సీ నారాలోకేష్ ఫైర్ అయ్యారు.
తన తల్లి ఏనాడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదని… అలాంటి ఆమె గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఆయన…. నేటి ముఖ్యమంత్రి జగన్ తల్లి విజయలక్ష్మి, భార్య భారతి గురించి తాము మాట్లాడలేమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి మంచివి కావు అని తెలియచేశారు ఆయన.
కాని మేము అలా మాట్లాడం మాకు సంస్కారం ఉంది అని అన్నారు ఆయన, తాజాగా లోకేష్ కామెంట్లు చేయడం పై తెలుగుదేశం నేతలు కూడా ఇదే అంటున్నారు… పార్టీ తరపున నాయకులపై అధినేతలపై కామెంట్లు చేసుకోండి, మహిళల పై కామెంట్లు వద్దు అని కుటుంబాల జోలికి కామెంట్లు వెళ్లకూడదు అని అంటున్నారు టీడీపీ నేతలు.