జగన్ గుప్పెట్లో లోకేశ్…. అది జరిగితే అంతే….

జగన్ గుప్పెట్లో లోకేశ్.... అది జరిగితే అంతే....

0
89

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారని వార్తలు వస్తున్నాయి.. శాసనసభలో బిల్లులు అమోదం పొందాయి.. అయితే శాసనమండలిలో చైర్మన్ ఆ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపారు… దీంతో జగన్ చైర్మన్ తీరుపై ఆగ్రహంతో ఉన్నారట…

శాసనమండలిని రద్దు చేసి బిల్లును అమెదింప చేయాలని చూస్తున్నారట… ఒక వేల జగన్ శాసనమండలిని రద్దు చేస్తే కొద్దిపాటి వ్యతిరేకత వస్తుంది… రాజకీయ నిరుద్యోగులకు ఆశ్రయం కల్పించకపోవడం ఒకటి అయితే జగన్ కెబినెట్ లో పనిచేస్తున్న ఇద్దరు మంత్రులు…

పార్టీ స్థాపించినప్పటినుంచి వీరు వైసీపీకి అండగా ఉన్నారనే ఉద్దేశంతో జగన్ వారికి ఎమ్మెల్సీ కింద మంత్రిని చేశారు… అయితే వీరికి జగన్ ఎలాగో సర్ధిచెబుతారు ఇప్పుడు శాసన మండలి రద్దు చేస్తే చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేశ్ రాజకీయ నిరుద్యోగిగా మారడం ఖాయం అని అంటున్నారు… టీడీపీ హయాంలో ఎమ్మెల్సీ ద్వారా మంత్రి అయ్యారు లోకేశ్… 2019 ఎన్నికల్లో పోటీ చేసినా కూడా ఓటమి చెందారు దీంతో ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు…. ఇప్పుడు జగన్ శాసన మండలిని రద్దు చేస్తే ఎమ్మెల్సీ కూడా పోతుందని అంటున్నారు…