లోకేశ్ పై తమ్ముళ్లకు కొత్త డౌట్స్…

లోకేశ్ పై తమ్ముళ్లకు కొత్త డౌట్స్...

0
91

పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడే నాయకత్వ లక్షణాలు బయటపడతాయి… లీడర్ షిప్ అనేది వారసత్వంగా వచ్చేది కాదు… అలా అని కొని తెచ్చుకునేది కూడా కాదు… ప్రజల కష్టాలను తెలుసుకుని వారికి కొండంత భరోసా ఇస్తూ వారిచేత మన్ననలు పొందగలిగేలా ఉండాలి…. కానీ టీడీపీ జాతీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లో నాయకత్వ లక్షనాలు లేవన్నది ఇంటా బయట వార్తలు వినిపిస్తున్నాయి…

ఆయన నాయకత్వాన్ని టీడీపీ నాయకులే అంగీకరించడంలేదని వార్తలు వస్తున్నాయి… ప్రస్తుతం టీడీపీ సంక్షోబంలో ఉందని అంటున్నారు… ఇలాంటి క్లిష్టమైన సమయంలో తమ్ముళ్లు సైకిల్ కు దూరంగా ఉంటున్నారు… సీనియర్ నాయకులు సైతం పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు…

ఈ సమయంలో పార్టీ నేతలకు బూస్ట్ నిచ్చి వారందరిని ఏకాతాటిపై తీసుకురావల్సిన లోకేశ్ ట్విట్టర్లకే పరిమితం అయ్యారని విమర్శలు వస్తున్నాయి… స్థానిక సంస్థల ఎన్నికల విషయంలోనూ లోకేశ్ పరిమితంగానే ఉన్నారనే వార్తలు వచ్చాయి..

చంద్రబాబు నాయుడు తర్వాత పార్టీ పగ్గాలను చేపట్టాల్సింది లోకేశే…. ఇందులో ఏ మాత్రం సందేహం లేదని ఇప్పుడు బయటకు వచ్చి పార్టీనేతలకు, కార్యకర్తలకు అండగా ఉండాల్సిన సమయం అని అంటున్నారు…