జగన్ ప్రభుత్వాన్ని ఇరికించేందుకు మరో తిరుగుబాటుకు రెడీ అయిన లోకేశ్

జగన్ ప్రభుత్వాన్ని ఇరికించేందుకు మరో తిరుగుబాటుకు రెడీ అయిన లోకేశ్

0
83

ప్రభుత్వ ఉద్యోగం కోసం నిద్రాహారాలు మాని కష్టపడి చదివి పరీక్ష రాస్తే, మీ పెద్దలు గద్దల్లా పరీక్ష పేపరు ముందే ఎత్తుకుపోయారని లోకేశ్ వైసీపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. ఒక్కో ఉద్యోగాన్ని 5 లక్షలకు అమ్ముతున్నారనే వార్తలపై స్పందించలేదెందుకు? ఆశలు అడియాశలైన నిరుద్యోగుల కన్నీళ్లకూ ఖరీదు కట్టి చెల్లిస్తారా అని ప్రశ్నించారు.

వైసీపీ దళారులు పరీక్ష పేపర్ అమ్మేసిన విషయం మంత్రి పెద్దిరెడ్డికి ముందే తెలుసన్నది నిజం కాదా అని లోకేశ్ ప్రశ్నించారు.

ఉద్యోగాల పేరుతో నిండాముంచిన మీ తుగ్లక్ ప్రభుత్వంపై నిరుద్యోగుల తిరుగుబాటు తప్పదని లోకేశ్ హెచ్చరించారు.. పేపర్ లీక్ స్కాం పై పూర్తి స్థాయి విచారణ జరగాల్సిందే అని అన్నారు..