లోకేశ్ మరో నియోజకవర్గంకు షిఫ్ట్…

లోకేశ్ మరో నియోజకవర్గంకు షిఫ్ట్...

0
70

ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు… కుట్రలు కుతంత్రాలతో చంద్రబాబు నాయుడు మండలిని దుర్వినియోగం చేశారని ఆయన మండిపడ్డారు…

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు మండలి దుర్వినియోగం ఫలితమే ఇప్పుడు మండలి రద్దు వరకు వెళ్లిందని ఆరోపించారు… ప్రస్తుతం చంద్రబాబు నాయుడు రిటైర్డ్ అయి లోకేశ్ కు కుప్పం నుంచి అవకాశం ఇవ్వాలని అన్నారు…

చంద్రబాబుకు అదొక్కటే మిగిలి ఉందని అన్నారు… 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమి చెందిన లోకేశ్ కౌన్సిల్లో పెత్తనం చేశారని పూర్ణచంద్ర ప్రసాద్ ఆరోపించారు… ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలిని చూస్తున్నారని కానీ దానికి టీడీపీ నాయకులు అడ్డుతగులుతున్నారని ఆరోపించారు…