ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ ఇరిగేషన్ శాఖమంత్రి దేవినేని ఉమాపై అలాగే చంద్రబాబు నాయుడు కుమారుడు నారాలోకేశ్ పై మంత్రి అనిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు… ఇటీవలే టీడీపీ నాయకులు మీడియా సాక్షిగా మంత్రి అనిల్ కు తన శాఖ గురించి అవగాహణ లేదని అన్నారని మీడియా గుర్తు చేయగా అందుకు ఆయన బదులిచ్చారు…
తాను ఇరిగేషన్ శాఖ గురించి నేర్చుకుంటున్నానని తెలిపారు.. గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ఉమా తన గుండెల మీద చెయి వేసుకుని చెప్పాలని మొదట్టో ఆయనకు ఇరిగేషన్ గురించి అంతా తెలుసని ప్రమాణం చేసి చెప్పాలని అన్నారు.. ఆయా శాఖల్లో ఉన్న లోకేశ్ కు అచ్చెన్నాయిడు తెలుసా అని ప్రశ్నించారు…
వారికి అప్పుడు తెలిదని అప్పుడు కూడా వారికి శాఖల గురించి పూర్తిగా తెలిదని అన్నారు… కానీ తాను తన శాఖ గురించి పూర్తిగా తెలుసుకుంటానని స్పష్టం చేశారు అనిల్… పోలవరం విషయంలో సక్సెస్ అయ్యామని అన్నారు…