రైతుకి విత్తనాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని టీడీపీ నేత లోకేశ్ ఆరోపించారు… విత్తనాల కోసం రైతులు లైన్ల లో నిలబడి లాఠీ దెబ్బలు తినే రోజులు తెచ్చారనొ ఆరోపించారు. సున్నా వడ్డీకే రుణాలు అంటూ గతంలో లేని పథకంలా హడావిడి చేసి దొరికిపోయారని ఎద్దేవా చేశారు… సున్నా వడ్డీ దేవుడెరుగు అసలు రుణాలు ఇస్తే చాలు అనే పరిస్థితి వచ్చిందని అన్నారు.
3 వేల కోట్ల తో ధరల స్థిరీకరణ నిధి అన్నారు. పంట వెయ్యకముందే గిట్టుబాటు ధర ప్రకటిస్తాం అని మ్యానిఫెస్టో లో పెట్టారు. పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారని మండిపడ్డారు లోకేశ్.
12,500 రైతు భరోసా అని 7,500 మాత్రమే ఇస్తున్నారు. ఇలా అనేక ఇబ్బందుల్లో రైతులు కూరుకుపోతున్నారు. రైతులకు అండగా ఉంటామని లకేశ్ భరోసా ఇచ్చారు…
—