లోకేష్ విషయం లో బాబు అసంతృప్తి త్వరలోనే తీరనుందా .

లోకేష్ విషయం లో బాబు అసంతృప్తి త్వరలోనే తీరనుందా .

0
110

రాజకీయాల్లో అపర చాణుక్యుడిగా పేరు తెచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు . ప్రత్యర్థుల్ని ప్రశ్నించడం లో వారి ఎత్తులకు పై ఎత్తులు వేయడం లో బాబు గారు ఆరితేరిపోయారు . రాష్ట్ర రాజకీయాలు దగ్గర నుండి దేశ రాజకీయాల వరకు ఏ టాపిక్ గురించైనా మాట్లాడే మేధస్సు బాబు గారి సొంతం .

అయితే ఈ బాబు గారి మేధస్సు అయన బాబైన లోకేష్ కు రాకపోవడం ఆయనకు ఒక అసంతృప్తే అని చెప్పాలి . లోకేష్ ప్రసంగాల్లో చేసే చిన్న చిన్న తప్పులను పట్టుకొని ప్రతిపక్షాలు చేసే హేళన అంత ఇంత కాదు . మంగళ గిరి లో లోకేష్ ఓటమి తర్వాత ఇది మరింత ఎక్కువైంది .

అయితే ఈ విషయం పై చంద్రబాబు ఏ రోజు రివర్స్ కామెంట్స్ చెయ్యలేదు . ఒకవేళ ఆలా చేస్తే వాళ్ళు మరింత రెచ్చిపోయే ప్రమాదముందని బావించినట్టున్నారు . అయితే లోకేష్ కి రాజకీయ చదరంగం పూర్తిగా నేర్పి తర్వాత పార్టీ పగ్గాలు అప్పగించాలని బాబు భావిస్తున్నట్లు తెలుస్తుంది .అయితే ఇప్పుడు సాగుతున్న వైసీపీ హవా లో లోకేష్ కి పార్టీ ని అప్పగిస్తే కచ్చితంగా పార్టీ కి దెబ్బ పడుతుందని సొంత పార్టీ నేతలే భావిస్తున్నట్లు సమాచారం