ఈరోజుల్లో క్రియేటివిటీగా ఏం చేసినా అది పెను సంచలనం అవుతోంది, ఇక చాలా మంది దానికి కితాబు ఇస్తున్నారు, తక్కువ పెట్టుబడితో వ్యాపారం పెట్టి కోట్లు సంపాదిస్తున్న స్టార్టప్ లు ఉన్నాయి, సో మన ఐడియా కొత్తగా ఉంటే ఎవరూ చేయనిది మనం చేస్తే దానికి చాలా మంది వెల్ కం చెబుతారు, దానికి ప్రశంసలు వస్తాయి, ఈ రోజుల్లో ఎవరైనా ఇళ్లుకట్టుకోవాలి అంటే ఎంత కష్టమో తెలిసిందే సుమారు 20 లక్షలు ఉంటే కాని ఇల్లు పూర్తి అవ్వడం లేదు, ఇక కూడబెట్టిన డబ్బు లోన్ తీసుకుని ఇళ్లు కట్టుకుంటున్నారు చాలా మంది.
కాని ఈ వ్యక్తిని చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది..ఒక వ్యక్తి కేవలం రూ.లక్షకే లగ్జరీ ఇల్లు కట్టుకున్నాడు. ఇప్పుడు అతనిని అందరూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు, మరి లక్షకు ఇల్లు ఏమిటి అని డౌటా.చెన్నైకి చెందిన అరుణ్ ప్రభు అనే ఒక వ్యక్తి ఆటోపై లగ్జరీ ఇల్లు కట్టుకున్నాడు. అన్ని సౌకర్యాలు కూడా ఇందులో కల్పించుకున్నాడు..
కిటికీలు, వాకిళ్లు, రూఫ్ ఇలా అన్ని ఇందులో ఉంటాయి, ఇది చూసి నెటిజన్లు సూపర్ అంటున్నారు.
మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా అరుణ్ ఆటో ఇంటి ఫోటోలను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు.
ఇక కరెంట్ కోసం సోలార్ రూఫ్ పెట్టుకున్నాడు, సో చాలా తక్కువ ప్లేస్ లో సూపర్ హౌస్ అంటున్నారు అందరూ.
మీరు ఇది చూడండి
|
|
లక్షరూపాయలకే లగ్జరీ ఇల్లు చూస్తే మతిపోతుంది
-