జేసీ దివాకర్ రెడ్డి పై మరోసారి మీసం తిప్పిన మాధవ్…

జేసీ దివాకర్ రెడ్డి పై మరోసారి మీసం తిప్పిన మాధవ్...

0
88

తెలుగుదేశం పార్టీ ఎంపీ జెసి దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే…. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంత జిల్లా పర్యటనలో భాగంగా జెసి దివాకర్ రెడ్డి పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై పోలీస్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇటీవలే వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా స్పందించారు…

శాంతి భద్రతల కోసం నిత్యం పనిచేస్తున్న పోలీసులను కించపరిచేలా మాట్లాడటం మంచిదికాదని మాధవ్ అన్నారు.. పోలీస్ వ్యవస్థలో ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎంపీ లు మంత్రులు అయ్యే సమర్థులు ఉన్నారని అందుకే జేసీ దివాకర్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యాలు చేస్తున్నారని ఆయన అన్నారు. జెసి దివాకర్ రెడ్డి కథ ముగిసిపోయిందని అన్నారు.. పోలీసులను కించపరిచే విధంగా మాట్లాడుతున్నా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడకపోవడం బాధాకరం అని మాధవ్ అన్నారు.

జిల్లాలో శాంతి భద్రతలు కాపాడుతున్నారని టీడీపీ ప్రభుత్వంలో అనేక హత్యలు జరిగాయని ఆయన గుర్తు చేశారు గతంలో శత్రుదేశాలమీద పోరాడే క్రమంలో గణనీయమైన పాత్రపోషించిన పోలీస్ బూట్లను తన చేతితో దుమ్మును తుడిచి ముద్దాడారు మాధవ్.

అలాగే తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దరెడ్డి కూడా స్పందించారు… పోలీస్ శాఖలో బూట్లు నాకేవారు ఉండరని బూట్లు వాడేవారు ఉంటారు అని అన్నారు. జిల్లాలో జెసి బ్రదర్స్ పోలీస్ వ్యవస్థను 30 సంవత్సరాలుగా వాడుకుంటున్నారని దమ్ముంటే వారు గున్ మ్యాన్ లు లేకుండా ప్రజల్లో తిరగాలని డిమాండ్ చేశారు పెద్దారెడ్డి