మద్యం కమీషన్లపై వైసీపీపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

మద్యం కమీషన్లపై వైసీపీపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

0
93

ఏపీలో మద్యం రేట్లు ఆకాశాన్నంటాయి ..అయితే మద్య పాన నిషేదం విడతల వారీగా చేస్తామన్న సర్కారు మరింత రేట్లు పెంచి కమీషన్లు దండుకుంటోంది అని విమర్శలు చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇష్టారాజ్యంగా జే ట్యాక్స్ వసూలు చేస్తున్నారు అని జగన్ సర్కార్ పై విమర్శలు చేశారు.

రాష్ట్రంలో ఈ ఎనిమిది నెలల్లో మద్యం పాలసీ ద్వారా ఎంతో నష్టం వచ్చిందని అన్నారు. ఆదాయం పెరగడం కాదు సరికదా, ఇంకా తగ్గిపోయిందని తెలిపారు. మద్యంలో జే ట్యాక్స్ వసూలు చేస్తున్నారు అని ఆయన విమర్శించారు. ఇదంతా కమీషన్ల కోసమే అని విమర్శించారు.

ఎంపిక చేసిన బ్రాండ్లనే అమ్మకానికి పెడతారా…హూ ఆర్ యూ… వినియోగదారుడు ఏం తాగాలో చెప్పడానికి నువ్వెవరివయ్యా అని ప్రశ్నించారు, మీకు కమీషన్లు ఇవ్వకపోతే ఆ కంపెనీ మద్యం అమ్మకానికి రానివ్వరు, వాళ్ల బ్రాండ్ ని మీరు స్టేట్ లో లేకుండా చేస్తున్నారు అని విమర్శించారు. శ్రీకాకుళంలో ఇంటర్నేషనల్ ఫ్యాక్టరీ ముడుపులు ఇవ్వలేమని ఉత్పత్తి నిలిపివేసింది. తెలంగాణలో మద్యం రేట్లు చూడండి ఏపీలో మద్యం రేట్లు చూడండి అని విమర్శించారు.