మగవారికి మోదీ గుడ్ న్యూస్ ఇక పండుగ చేసుకుంటారు

మగవారికి మోదీ గుడ్ న్యూస్ ఇక పండుగ చేసుకుంటారు

0
75

కొన్ని దేశాల్లో మహిళలకు ఇచ్చే సెలవులు కొన్ని ఫెసిలిటీలు సౌలభ్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి.. మరీ ముఖ్యంగా ఉద్యోగాల్లో ఇది మరింత ఎక్కువ ఉంటుంది అనే చెప్పాలి. అయితే వీటితో మన దేశంలో పోలిస్తే చాలా తక్కువ ఉంటాయి.. పిల్లలు పుట్టే సందర్భంలో తల్లులకు ఆఫీసులు సెలవులు ఇస్తాయి కానీ.. తండ్రులకు నో అని చెప్పేస్తాయి.

అప్పుడే పుట్టిన బుజ్జాయితో గడపాలని తండ్రి అనుకున్నా.. అందుకు సాధ్యంకాని పరిస్థితి. కాని దాదాపు 45 దేశాల్లో మాత్రం తండ్రులకి కూడా సెలవులు ఇచ్చే కంపెనీలు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి.. తాజాగా కేంద్రం ఈ అంశం మీద కొత్త నిర్ణయాన్ని తీసుకునేలా ఆలోచనలు చేస్తోంది.
ఇప్పటివరకూ అమ్మలకు మాత్రమే ఇచ్చే సెలవుల్ని.. నాన్నలకుకూడా వర్తింపచేయాలన్న ఆలోచనలో మోడీ సర్కార్ ఉందట. దీనిపై గతంలో చాలా మంది కేంద్ర ప్రభుత్వానికి దీనిపై ఆలోచన చేయాలి అని చెప్పారు.

ఇది అమలు అయితే తండ్రులయ్యే పురుషులకు కూడా సెలవులు అందుబాటులోకి రానున్నాయి.దీనికి సంబంధించిన బిల్లును త్వరలో పార్లమెంటులో ప్రవేశ పెట్టాలన్న ఆలోచన లో కేంద్రం ఉందట. అయితే దీనికి అన్ని పార్టీలు కూడా ఒకే చెబుతాయి, ఈజీగా బిల్లు పాస్ అవుతుంది అంటున్నారు రాజకీయ నేతలు..పితృత్వ సెలవులు చూస్తే ఇప్పుడు ఉన్న నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 15 రోజుల పాటు షరతులతో కూడిన పితృత్వ సెలవులు ఇస్తున్నారు.. సో కొత్త చట్టం వస్తే మరిన్ని సెలవులు వస్తాయి.