మాజీ ముఖ్యమంత్రి భార్యకి సర్కార్ షాక్

మాజీ ముఖ్యమంత్రి భార్యకి సర్కార్ షాక్

0
92

కొత్త ప్రభుత్వాలు వస్తే కొత్త నిర్ణయాలు తీసుకుంటాయి ఆ ప్రభుత్వాలు.. గత ప్రభుత్వాలు చేసిన పనులపై కమిషన్ లు ఏర్పాటు చేసి వాటిలో లొసుగులు కూడా బయటకు తీస్తారు.. కానిమహా రాష్ట్ర రాజకీయాలు ఇటీవల చూశాం. పొత్తులు పెట్టుకున్న పార్టీలు విడిపోయి అపొజిట్ పార్టీలతో కలిసిప్రభుత్వం ఏర్పాటు చేశాయి.

అయితే అక్కడ ఇప్పటి వరకూ అధికారంలో ఉన్న బీజేపీకి థాకరే సర్కార్ షాక్ ఇస్తోంది, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్‌కు మహారాష్ట్ర సర్కారు ఝలక్కిచ్చింది. అయితే సీఎం భార్యకు ఎందుకు షాక్ అనేది కూడా తెలుసుకోవాలి.

థానే మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులకు ప్రస్తుతం యాక్సిస్ బ్యాంకు నుంచి వేతనాలు చెల్లిస్తున్నారు. తాజాగా, ఈ జీతాలను యాక్సిస్ బ్యాంకు నుంచి కేంద్రం అధీనంలో ఉన్న మరో బ్యాంకుకు మార్చబోతున్నట్టు థానే మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ నరేశ్ మాస్కే ప్రకటించారు. ఈ మార్పుకి ఓ కారణం కూడా ఉంది.

యాక్సిస్ బ్యాంకులో అమృత ఫడ్నవీస్ పనిచేస్తుండడం వల్లే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మాజీ ముఖ్యమంత్రి భార్య అక్కడ పెద్ద హోదాలో ఉండటం వల్ల, ఉద్యోగుల ఖాతాలు అందులో ఉంటే ఏమవుతుంది అని కొందరు ఉద్యోగులు అక్కడ సామాన్యులు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.