మాజీ జేడీ కూడా జనసేన నుంచి జంప్ అంటగా

మాజీ జేడీ కూడా జనసేన నుంచి జంప్ అంటగా

0
71

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి… ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు జనసేన నాయకులు కూడా తమ రాజకీయ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు….

ఇప్పటికే చాలామంది జనసేన నాయకులు పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే… ఇక పార్టీ తరపున గెలిచిన ఒక్కగానొక్క ఎమ్మెల్యే రాపాక కూడా వైసీపీలోకి చేరకున్నా కూడా ప్రభుత్వ నిర్ణయాలను స్వాగతిస్తున్నారు… ఇక ఇదే క్రమంలో పార్టీ తరపున నంబర్ 3 గా గుర్తింపు తెచ్చుకున్న మాజీ జేడీ లక్ష్మీ నారాయణ విషయం మరోసారి తెరపైకి వచ్చింది….

ఆయన త్వరలో జనసేనకు గుడ్ బై చెప్పనున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి…. గతంలో కూడా ఇలాంటి వార్తలు వచ్చాయి దానిపై ఆయన క్లారిటీ ఇచ్చారు…. ఈ నేపథ్యంలోమరోసారి ఆయన పార్టీ మారుతున్నారని వార్తలు వస్తున్నాయి… ఈ వార్తలపై ఆయన స్పందిస్తారో లేదో చూడాలి…