మాజీ మంత్రి అరెస్ట్ కు రంగం సిద్దం టీడీపీలో కలకలం

మాజీ మంత్రి అరెస్ట్ కు రంగం సిద్దం టీడీపీలో కలకలం

0
66

మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడుకు అలాగే సోదరుడు సన్యాసి పాత్రుడుల మధ్య ఇటీవలే మరోసారి విభేదాలు భగ్గుమన్న సంగతి తెలిసిందే… ఎన్నికల ముందు నాటి నుంచి బ్రదర్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైర్యం కొనసాగుతోంది… అందుకే ఇటీవలే తమ్ముడు సన్యాసి పాత్రుడు ఆయన కుమారుడు సన్యాసి వరుణ్ లు కలిసి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు…

సన్యాసి పాత్రుడు వైసీపీ తీర్ధం తీసుకున్నాకూడా బ్రదర్స్ ఇద్దరు ఒకే ఇంట్లోనే ఉన్నారు…. ఈ క్రమంలో సన్యాసిపాత్రులు మంచి ముహూర్తం చూసుకుని తాను నివాసం ఉంటున్న ఇంటిపైన వైసీపీ జెండాపాతేందుకు ఆయన కుమారుడు ప్రయత్నిస్తుండగా అయ్యన్న పాత్రుడు వర్గీలు కుమారుడు విజయ్ వరుసకు చిన్నాయన కలిసి వరుణ్ ను అడ్డుకున్నారు…

దీంతో వరుణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు… తమకు ప్రాణ హాణి ఉందని పోలీసులు తమకు రక్షణ కల్పించానలి కోరారు వరుణ్… దీంతో పోలీసులు అక్కడి చేరుకున్నారు అనుమతి లేకుండా పోలీసులు ఎలా వస్తారంటూ అయ్యన్న నిలదీశారు…

అయితే అయ్యన్న పాత్రుడు తమ విధులకు ఆటంకం కల్పించారనే ఉద్దేశంతో పోలీసులు దర్యాప్తు చేసిన ఆయనపై కేసు నమోదు చేశారు… అరెస్ట్ చేస్తారంటు పార్టీ వర్గాల్లో చర్చ కూడా జరుగుతోంది… దీంతో నర్సీపట్నంలో టెన్షన్ వాతావరణం నెలకొంది…