నెల్లూరు నాయకుడు తెలుగుదేశం పార్టీలో కీరోల్ పోషించిన మాజీ మంత్రి నారాయణకు ఓటమి తర్వాత టీడీపీలో సరైన ప్రాధాన్యం లేదు, అలాగే ఆయన కూడా రాజకీయంగా ఎక్కడా పెద్ద పాల్గొనడం లేదు.. తాజాగా నారాయణ విషయంలో వైసీపీ కూడా ఎక్కడా విమర్శలు చేయడం లేదు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ముఖ్యంగా నారాయణ కాలేజీలు స్కూల్స్ గురించి వైసీపీ నిత్యం టార్గెట్ చేసేది. ఇప్పుడు మాత్రం విమర్శలు లేవు.
అయితే ఆయన బీజేపీలోకి కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వినిపించాయి. కాని అది కేవలం గాసిప్ అని అంటున్నారు. తాజాగా టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణకు ఘోర అవమానం జరిగింది అని తెలుస్తోంది. ఆయన అనంతపురం జిల్లాలో పర్యటించిన సమయంలో ఆయనని విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. అయితే ఈ సందర్భంగా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు.
కార్పరేట్ స్కూళ్ల దందా అంటూ నినాదాలు చేశారు.
ఏళ్ల తరబడి ఫీజుల పేరుతో నారాయణ విద్యా సంస్థలలో విద్యార్థులను వేధిస్తున్నారని విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. అయితే ఇదే క్రమంలో వైసీపీ విద్యార్థి విభాగం నేత ఆవుల రాఘవేంద్ర నారాయణ షర్ట్ కాలర్ పట్టుకుని నిలదీశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. నారాయణ కారుకు అడ్డుపడి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న విద్యా సంస్థలను మూసివేయాలని వారంతా డిమాండ్ చేశారు. దీంతో అక్కడ వారు అందరూ షాక్ అయ్యారు, దీనిపై టీడీపీ నేతలు ఇంకా స్పందించాల్సి ఉంది.