రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సోమూ వీర్రాజును నియమించడంతో రానున్న రోజుల్లో ఆ పార్టీలో భారీ మార్పులు చోటు చేసుకోనుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు …పార్టీ మూల సిద్దాలకు భిన్నంగా ప్రవర్తిస్తున్న నేతలకు చెక్ పెట్టేలా వ్యూహాలను రూపొందిస్తోందట…కన్నా లక్ష్మీనారాయణ హయంలో బీజేపీ గాడి తప్పిందని తెలుగుదేశం నుంచి వచ్చిన కొందరు నేతలు గాడి తప్పించేలా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి.. దీన్ని సరిచేయడానికి రంగంలోకి దిగిందని అంటున్నారు… టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చినలంకా దినకర్ సహా మరో ముగ్గురికి షోకాజ్ నోటీసులను జారీ చేయడాన్ని దీనికి నిదర్శనంగా చూపుతున్నారు…
రాష్ట్రంలో టీడీపీ అధికారాన్ని కోల్పోయిన కొద్ది రోజుల వ్యవధిలోనే ఆ పార్టీకి చెందిన కొందరు కీలక నాయకులు బీజేపీలోకి జంప్ చేశారు…లంకా దినకర్ వంటి నేతలు సైతం బీజేపీ తీర్థం తీసుకున్నారు.. అక్కడిదాక బాగానే ఉన్నప్పటికీ టీడీపీకి చెందిన నాయకులు బీజేపీ సిద్దంతాలకు భిన్నంగా భిన్న వాదనలు వినిపిస్తున్నారని చాలా కాలం నుంచి వార్తలు వస్తున్నాయి…
ముఖ్యంగా మూడు రాజధానులు విషయంలో బీజేపీ నేతలు టీడీపీ గళాన్ని వినిపించారనే వాదలు వచ్చాయి… రాజధాని వ్యవహారం రాష్ట్ర పరిధిలోనిదని పదే పదే చెప్పినప్పటికీ ఇదే విషయంపై కామెంట్స్ చేశారు… టీవీ చర్చల్లో కూడా మూడు రాజధానుల వ్యవహారంపై కామెంట్స్ చేశారు… అందుకే టీడీపీ ముద్రను తుడిసేలా బీజేపీ నాయకులు చర్యలు తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి… అందులో భాగంగాను దినకర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి…
—
Regards,
N.Ramesh Babu