మళ్లీ ఏపీలో వైసీపీ ఆపరేషన్… టీడీపీ ఫస్ట్ వికెట్ డౌన్….

మళ్లీ ఏపీలో వైసీపీ ఆపరేషన్... టీడీపీ ఫస్ట్ వికెట్ డౌన్....

0
83

ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షణను షురు చేసింది.. ఈ ఆపరేషన్ కు టీడీపీ వెలవెలబోతుంది… ఇప్పటికే ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా చాలా మంది ద్వితియ శ్రేణి నాయకులు వైసీపీ గూటికి చేరిన సంగతి తెలిసిందే… ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అలాగే మద్దాలి గిరి, కరణంబలరాంలు ప్రత్యక్షంగా వైసీపీ తీర్థం తీసుకోకపోయినా ఆ పార్టీకి సపోర్ట్ గా ఉంటున్నారు…

ఇదే క్రమంలో ప్రకాశం జిల్లాకు చెందిన మరో కీలక నేత వైసీపీ తీర్ధం తీసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి… మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, అలాగే ఆయన కుమారుడు త్వరలో వైసీపీ తీర్థం తీసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి…

ప్రస్తుతం శిద్దా రాఘవరావు టీడీపీ పొలిటికల్ బ్యూరోగా జాతీయ కోశాధికారిగా ఉన్న సంగతి తెలిసిందే… గత ఎన్నికల్లో టీడీపీ తరపున ఒంగోలు పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి మాగంటి శ్రీనివాస్ చేతిలో ఓటమి చెందాను… కాగా గతంలో కూడా శిద్దా వైసీపీలో చేరుతారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే…