మాల్స్ లో షాపింగ్ కు వస్తే ఇక ఈ రూల్స్ పాటించాలి

మాల్స్ లో షాపింగ్ కు వస్తే ఇక ఈ రూల్స్ పాటించాలి

0
87

దేశ వ్యాప్తంగా క్లోజ్ అయిన మాల్స్ ఇక మరో నాలుగు రోజుల్లో తెరచుకుంటాయి, ఇక జూన్ 8 నుంచి ఈ మాల్స్ తీస్తారు, అయితే జనాలు ఆఫర్లు భారీగా పెడితే మళ్లీ ఎక్కువ సంఖ్యలో వచ్చే ప్రమాదం ఉంది.. అందుకే మాల్స్ లో భారీ ఆఫర్లు పెట్టరు అని తెలుస్తోంది.

ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి మాల్స్ తెరుచుకుంటున్నాయి. అయితే ఫుల్ సెక్యూరిటీ చెకింగ్ ఉంటుంది, అంతేకాదు డిస్కౌంట్లు ఆఫర్లు ఉండవు, ట్రయల్ రూమ్స్ ఉండవు, సైజ్ కలర్ చూసుకుని ఐటెమ్స్ కొనుగోలు చేయాలి, బట్టల దుకాణాల్లో శానిటైజర్ వాడాలి, మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి.

ఇక పిల్లలతో షాపింగ్ కు రాకుండా ఉంటే మంచిది, పెద్దలు 60 ఏళ్లు దాటిన వారు రాకుండా ఉంటే బెటర్, ..కొన్ని మాల్స్ ప్యాండమిక్ రెస్పాన్స్ టీమ్, ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. భార్య భర్తలు వచ్చినా భౌతిక దూరం పాటిస్తూ షాపింగ్ చేయాల్సి ఉంటుంది.