మన దేశంలో ఈ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు జపనీస్ మాట్లాడుతున్నారు – రియల్లీ గ్రేట్

మన దేశంలో ఈ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు జపనీస్ మాట్లాడుతున్నారు - రియల్లీ గ్రేట్

0
35

పిల్లలకు ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కాని చదువు ఇవ్వాలి, అదే వారికి పెద్ద ఆస్తి అవుతుంది.
ఇప్పుడు ఇంగ్లీష్ హిందీతో పాటు అక్కడ వారి మాతృభాషతో పాటు ఇతర దేశీయ భాషలు కూడా మన దేశంలో చాలా మంది నేర్చుకుంటున్నారు, అయితే తాజాగా మహారాష్ట్ర ఔరంగాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులు జపనీస్ నేర్చుకుంటున్నారు.

నిజంగా ఇది చాలా గొప్ప విషయం అనే చెప్పాలి, రోబోటిక్స్, సాంకేతిక పరిజ్ఞానంపై వారికి చాలా ఆసక్తి ఉంది.. ఇక్కడ 4 నుంచి 8వ తరగతుల విద్యార్థులు ఈ భాష నేర్చుకుంటున్నారు,వారికి ఈ టెక్నాలజీపై ఇంట్రస్ట్ ఉందట, వీరికి నెట్ కనెక్టివిటీకూడా ఏర్పాటు చేశారు.

వెంటనే పాఠశాల యాజమాన్యం ఇంటర్నెట్లోని వీడియోలు, అనువాదాలు నుంచి సమాచారాన్ని సేకరించి టీచింగ్ ప్రారంభించారు..సునీల్ జోగ్డియో వీరికి ఇలా గంటసేపు ఆన్ లైన్ తరగతులు చెబుతున్నారు, అంతేకాదు ఇక్కడ పిల్లలు నెమ్మదిగా జపనీస్ వారి పక్కన వారితో మాట్లాడుతున్నారు..ప్రాథమిక పదాలను ముందు నేర్చుకున్నారు.. తర్వాత సెంటెన్స్ అన్నీ చదువుతున్నారు..ఇక్కడ విద్యార్దులు సుమారు 70 మంది జపనీస్ నేర్చుకుంటున్నారు.