మన దేశంలో ఈ నాలుగు స్టేట్స్ లో కరోనా డేంజర్ బెల్స్

మన దేశంలో ఈ నాలుగు స్టేట్స్ లో కరోనా డేంజర్ బెల్స్

0
97

చైనాలో పుట్టి ఇలా ప్రపంచం అంతా ఈ వైరస్ పాకేస్తోంది, దాదాపు 52 లక్షల మందికి ఈ వైరస్ పాకేసింది, ఇక మన దేశంలో నాలుగు స్టేట్స్ లో ఈ వైరస్ కేసులు అత్యధికంగా నమోదు అవుతున్నాయి..
మన దేశవ్యాప్తంగా ఆదివారం నాటికి 1,31,868 కేసులు నమోదు కాగా, 3,867 మంది మరణించినట్లు ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి.

ఇక కేసులు ఎక్కువ ఎక్కడ నమోదు అవుతున్నాయి అని చూసుకుంటే, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ.. ఈ నాలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో 67 శాతం ఈ నాలుగు రాష్ట్రాల నుంచే ఉన్నట్లు గణాంకాలు చెప్తున్నాయి.

దీంతో ఇక్కడ కేసులు తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు… ఇక వారంలో లాక్ డౌన్ పూర్తి అవుతుంది… ఈ సమయంలో కచ్చితంగా ఈ ప్రాంతాల్లో ఉన్న రెడ్ జోన్ లు కంటైన్ మెంట్ జోన్ లో లాక్ డౌన్ ఇంకా కొనసాగించాలి అని చూస్తున్నారు, అయితే లాక్ డౌన్ దేశ వ్యాప్తంగా మరోసారి పొడిగిస్తారా లేదా ఇలా కేసులు పెరుగుతున్న ప్రాంతాల్లో పొడిగిస్తారా అనేది చూడాలి.