మన దేశంలో ఆత్మహత్యల్లో ఏ రాష్ట్రం ఏ స్ధానంలో ఉందో చూడండి ?

మన దేశంలో ఆత్మహత్యల్లో ఏ రాష్ట్రం ఏ స్ధానంలో ఉందో చూడండి ?

0
34

ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా కొందరు ఆత్మహత్యే శరణ్యం అని భావిస్తూ ఉంటారు, ఎంత కష్టపడినా ఉద్యోగం రాలేదని కొందరు, భర్త భార్య తగాదాల వల్ల ఆత్మహత్య చేసుకునే వారు కొందరు, ప్రేమ విఫలమై కొందరు, పెళ్లికావడం లేదు అని కొందరు, అత్యంత విషాదంగా ఆర్ధిక ఇబ్బందులతో రైతులు కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటనలు విన్నాం.

గత ఏడాది దేశంలో ఎంత మంది ఆత్మచేసుకున్నారన్న వివరాలను జాతీయ నేర గణాంకాల విభాగం (NCRB) వెల్లడించింది. గత ఏడాది మన దేశంలో 139,123 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో రైతులు చాలా మంది ఉన్నారు.

ఇక ఏ స్టేట్ లో ఎక్కువ ఆత్మహత్యలు జరుగుతున్నాయి అనేది చూస్తే

మహారాష్ట్ర టాప్ ప్లేస్లో ఉంది. ఇక్కడ 18 వేల మంది ఆత్మహత్య చేసుకున్నారు.
తమిళనాడు రెండో స్థానంలో ఉంది ఇక్కడ 13 వేలకుపైగా ఆత్మహత్యలు చేసుకున్నారు
పశ్చిమ బెంగాల్ 3 స్ధానంలో ఉంది ఇక్కడ 12 వేల ఆత్మహత్యలు జరిగాయి
నాలుగో స్థానంలో తెలంగాణ ఉంది ఇక్కడ 7,675 మంచి ఆత్మహత్య చేసుకున్నారు
6,465 ఆత్మహత్యలతో ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానంలో ఉంది

అయితే బీహార్, ఒడిశా, ఉత్తరాఖండ్, మణిపూర్, చండీగఢ్, డామన్ డయ్యూ, ఢిల్లీ, లక్షద్వీప్, పుదుచ్చేరిలో గత ఏడాది ఏరైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదు..ఇది సంతోషించదగ్గ పరిణామం.