మనసున్న మారాజు – దేశంలో రికార్డు – విప్రో భారీ విరాళం

మనసున్న మారాజు - దేశంలో రికార్డు - విప్రో భారీ విరాళం

0
88

కరోనా వైరస్ మన దేశం పై పంజా విసురుతోంది.. ఈ సమయంలో భారత్ లో ఉన్న ప్రముఖులు కుబేరులు సినీ స్టార్స్ వ్యాపారవేత్తలు బిజినెస్ టైకూన్స్ భారత్ కు సాయం అందిస్తున్నారు.. పీఎం కేర్ ఫండ్స్ కు విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే అంబానీలు టాటాలు సాయం అందించారు.

తాజాగా భారత శ్రీమంతుల్లో ఒకరైన అజీమ్ ప్రేమ్ జీకి చెందిన విప్రో, అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ కరోనా కట్టడి కోసం ఏకంగా రూ. 1,125 కోట్లను కేటాయించింది, దీంతో ఇది భారత్ కు కరోనా కట్టడికి ఉపయోగించనున్నారు.

ఈ సమయంలో ప్రాణాలు కూడా లెక్క చేయకుండా డాక్టర్లు పోలీసులు కష్టపడుతున్నారని వారి సేవలు ఎంతో గ్రేట్ అని అన్నారు, వైద్య సదుపాయాల అభివృద్ధి, బాధితులకు చికిత్స, కరోనా నియంత్రణ కోసం నిధులను వెచ్చించనున్నారు. ఈ కార్యక్రమాల అమలు కోసం సంబంధిత శాఖల సహకారం తీసుకోనున్నారు. దీని కోసం ఈ ఫౌండేషన్ తరపున 1600 మంది వైద్యులు సాయం చేయనున్నారు.