సీఎం జగన్‌తో చిరంజీవి భేటీపై మంచు విష్ణు సంచలన కామెంట్స్

0
97

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ తో చిరంజీవి ఇటీవల భేటీ అయ్యారు. చిరంజీవి, జగన్ మధ్య మర్యాదపూర్వక లంచ్‌ భేటీ జరిగింది. తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పలు అంశాలు ఈ భేటీలో చర్చించారు. తాను ఇండస్ట్రీ తరఫున సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసేందుకు వచ్చానని చిరంజీవి అప్పుడు పేర్కొన్నారు. సీఎం జగన్‌ తో మెగాస్టార్‌ చిరంజీవి భేటీ ఆయన వ్యక్తిగతం అంటూ ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు సంచలన కామెంట్స్ చేశారు.

అలాగే టికెట్ల ధరలపై సినీ ఇండస్ట్రీ ఏకతాటిపైకి రావాలన్నారు మంచు విష్ణు. ఇప్పటికే అన్ని చాంబర్స్‌తో మంతనాలు జరుగుతున్నాయన్నారు. రెండు ప్రభుత్వాలతోనూ టికెట్‌ ధరల విషయంపై చర్చలు జరగాలన్నారు. అయితే చాంబర్స్‌ మధ్య విభేదాలే చర్చల్లో సాగదీతకు కారణమని విష్ణు మాటల్లో తెలుస్తోంది.

మా అసోసియేషన్ 100 రోజుల ప్రగతిపై త్వరలో మీడియాతో మాట్లాడుతానని చెప్పారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సినిమా టికెట్లపై నిర్ణయం తీసుకుంటుంది… వ్యక్తిగతంగా నా నిర్ణయంతో పని లేదు.. ఎవరూ నా అభిప్రాయం అడగడం లేదని స్పష్టం చేశారు. సినిమా టిక్కెట్స్ పై వైఎస్సార్ హయాంలోనే ఓ జీవో వచ్చింది… దానిపై కూడా చర్చ జరగాలన్నారు.