మందుబాబులకు తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్

మందుబాబులకు తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్

0
87

ఈ లాక్ డౌన్ వేళ దాదాపు 45 రోజుల పాటు మందుబాబులకి మద్యం దొరకలేదు, దీంతో చాలా మంది ఇబ్బందులు పడ్డారు, అయితే తర్వాత కేంద్రం సడలింపుల్లో భాగంగా మే నెల నుంచి మద్యం షాపులు తెరచుకున్నాయి, ఇక మద్యం షాపులు ముందు 11 నుంచి సాయంత్రం 5 అలాగే ఆరు గంటలలోపు క్లోజ్ అయ్యేవి, తర్వాత కర్ఫ్యూతో షాపులు బంద్ అయ్యేవి..

కాని తాజాగా కర్ఫ్యూ సమయం ఇచ్చారు ఇక రాత్రి 9 గంటల నుంచి కర్ఫూ ఉంటుంది, అయితే ఈసమయంలో
మందుబాబులకు తెలంగాణ సర్కార్ మరోసారి గుడ్ న్యూస్ అందించింది. ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు రాత్రి 8.30 గంటల వరకు తెరిచి ఉంటాయని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు.

జూన్ 1 నుంచి రాత్రి 8 గంటల వరకు తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. తాజాగా మరోసారి ఆ సమయాన్ని పెంచుతున్నట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. దీంతో మందు బాబులు మద్యం కోసం పెద్ద పెద్ద క్యూ లైన్లు పెట్టక్కర్లేదు అని తెలిపారు. దీంతో మందు బాబులు ఆనందంలో ఉన్నారు.