మంత్రి వెల్లంపల్లి పై మంతెన మాటల యుద్ధం .

మంత్రి వెల్లంపల్లి పై మంతెన మాటల యుద్ధం .

0
80

వైసీపీ నేతలపై టీడీపీ నేతలు విరుచుకు పడేది తక్కువ సందర్బాల్లో అయినా అప్పుడు వాళ్ళు చేసే విమర్శలు మాత్రం చాల ఘాటుగా ఉంటాయి . ఇప్పుడు దేవాదాయ శాఖామంత్రి వెల్లంపల్లిపై ,టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయి .

దేవాలయం లో హుండీ కాజేసే వాళ్ళకి దేవాదాయ శాఖని అప్పగించారంటూ అయన వెల్లంపల్లి పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి . ఈయనకి వాళ్ళ నాయకుని ఆరాధన గురించి ఉన్న ఆలోచన ఆలయాల అభివృద్ధిపై లేదని అయన అన్నారు . ఆదాయం గురిచి తప్ప అర్చకుల అవస్థలు గురించి పట్టించుకోరా అంటూ వెల్లంపలికి పై మంతెన ప్రశ్నల వర్షం కురిపించారు .

అధికారం లోకి వచ్చన దగ్గరనుండి ఆలయాల విషయం లో వైసీపీ చేసిన అభివృద్ధి శూన్యమని ,ఇప్పటికైనా ప్రభుత్వం వైఖరి మార్చుకుని అర్చకులకు సాయం చేసే దిశగా కదలాలని అయన నేరుగా ప్రభుత్వాన్ని ప్రశించారు . ఈ విషయం పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి ..