మంత్రి పెద్దిరెడ్డి స్కెచ్ లకు బాబు ఎత్తుగడలు

మంత్రి పెద్దిరెడ్డి స్కెచ్ లకు బాబు ఎత్తుగడలు

0
82

చంద్రబాబు ఈ ఎన్నికల్లో కుప్పంలో గెలిచినా ,జిల్లా రాజకీయాల్లో వచ్చిన ఎన్నికల ఫలితాల్లో మాత్రం ఎంతో వేధనతో ఉన్నారట. అయితే చంద్రబాబుకి జిల్లాలో ముఖ్యమైన రాజకీయ విరోధి అంటే కేవలం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని చెప్పాలి. వారిద్దరికి 40 ఏళ్ల రాజకీయ వైరం ఉంది అని అంటారు.

చిత్తూరు జిల్లాలో ఆయన కాంగ్రెస్ లో ఉంటే, బాబు తెలుగుదేశం లో ఉండేవారు, తర్వాత జగన్ దగ్గరకు పెద్దిరెడ్డి చేరి మొత్తం జిల్లా వైసీపీ రాజకీయాలు ఆయనే చూసుకునేవారు.. ఈసారి తెలుగుదేశం పార్టీపై టార్గెట్ పెట్టుకున్న పెద్దిరెడ్డి జగన్ ఆదేశాలతో అన్నీ పాటించారు. చివరకు జిల్లాలో కుప్పం మినహ మిగిలిన సీట్లు అన్నీ గెలుచుకున్నారు.

చిత్తూరులోని 14 నియోజకవర్గాల్లో 13 గెలిచిన వైసీపీ , ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి చంద్రబాబును కుప్పంలో కూడా ఓడించాలని పట్టుదలతో ఉందట. అయితే వైసీపీకి అంత సీన్ ఇవ్వను అని చంద్రబాబు అంటున్నారట, అందుకే ఇటీవల మూడు రోజులు జిల్లాలో పర్యటించారు బాబు.. పెద్దిరెడ్డి స్కెచ్ లకు మరింత పదునైన స్కెచ్ వేస్తాను అంటున్నారు చంద్రబాబు.