మ‌రో ఎన్నికకు పిలుపునిచ్చిన జగన్ సిద్దంకండి

మ‌రో ఎన్నికకు పిలుపునిచ్చిన జగన్ సిద్దంకండి

0
88

151 సీట్లు గెలుచుకుని పరిపాలనలో దూసుకుపోతున్న జగన్ పలు సంక్షేమ పథకాలు నెలకి ఒకటి చొప్పున స్టార్ట్ చేస్తున్నారు.. తాజాగా వచ్చే ఏడాది జనవరి 26 న అమ్మఒడి స్టార్ట్ చేయాలి అని భావించారు. కాని దానిని అంతకుముందే అంటే ఆ నెల తొమ్మిదో తేదీనే అమ్మఒడి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం అని ప్రకటించారు.

ఆ తర్వాత రాజకీయంగా వైసీపీ మరో అడుగు ముందుకు వేస్తోందట, పథకం తర్వాత స్ధానిక సంస్ధల ఎన్నికలకు వెళతాం అని తెలియచేస్తోంది ఏపీ సర్కార్ .. సీఎం జగన్ ఇదే విషయాన్ని మంత్రులకి తెలియచేశారు అలాగే ఈ నెలాఖరులోగా ఆలయ కమిటీలు, మార్కెట్‌ కమిటీలు వేయాలని మంత్రులను మరోసారి సీఎం ఆదేశించారు.

ఇకరెండు నెలలు మాత్రమే సమయం ఉండటంతో మంత్రులు కూడా జిల్లాలో కేడర్ కు ఈ విషయాన్ని తెలియచేశారు..ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగాలి అని తెలియచేస్తున్నారు, మొత్తానికి మరోపోరుకు రాజకీయ నేతలు సిద్దం అవనున్నారనే చెప్పాలి.