మరో పాతికేళ్లు గడిచినా జగన్ కు కష్టమేనట…

మరో పాతికేళ్లు గడిచినా జగన్ కు కష్టమేనట...

0
80

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు…. ప్రస్తుత ప్రభుత్వానికి పరిపాలన చేతకాదని అనుభవం లేని విధానాలను అవలంభిస్తూ తుగ్లక్ వైఖరితో నడుస్తోందని బొండా ఉమా ఆరోపించారు…

తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రస్తుతం ప్రభుత్వ పనితీరుపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలద్దరు గగ్గోలు పెడుతున్నారని ఆరోపించారు… టీడీపీ హాయంలో బ్రహ్మాండమైన పరిపాలన జరిగిందని అన్నారు…

అయితే ప్రస్తుత ప్రభుత్వ పనితీరు అలాలేదని అన్నారు… ప్రజా చైతన్య యాత్రలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని బోండా ఉమా హెచ్చరించారు… ఇంకో పాతికేళ్లు అయిన జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేరని ఆరోపించారు…