మరో పోరాటానికి టీడీపీ డేట్ ఫిక్స్…

మరో పోరాటానికి టీడీపీ డేట్ ఫిక్స్...

0
80

ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మరో పోరాటం చేసేందుకు సిద్దమైంది… అందుకు డేట్ కూడా ఫిక్స్ చేసింది… ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు…

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… రివర్స్ టెండర్ ద్వారా కోట్లాది రూపాయలు ఆదా అయ్యాయని ప్రభుత్వం చెబుతోందని అంటున్నారని ఒక్క రూపాయి కూడా ఆదా అవ్వలేదని బోండా ఉమా ఆరోపించారు… కాంట్రాక్టర్లకు మేలు చేసేలా జగన్ ప్రభుత్వం ఉందని ఆరోపించారు…

టీడీపీ హయాంలో 54 లక్షల మందికి పెన్షన్ ఇచ్చామని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 7 లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇస్తున్నారని ఆరోపించారు… జగన్ పేదల కడుపు కొడుతున్నారని ఆరోపించారు… అందుకే తాము పెన్షన్ తొలగింపుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ఆందోళన చేపడుతామని స్పష్టం చేశారు..