మాస్క్ పెట్టుకోపోతే కరెంట్ షాక్ సంచలన నిర్ణయం

మాస్క్ పెట్టుకోపోతే కరెంట్ షాక్ సంచలన నిర్ణయం

0
83

పాకిస్థాన్ అంటేనే డిఫరెంట్ ఆలోచనలు ఉంటాయి, శిక్షలు అలాగే ఉంటాయి, అందుకే ఇక్కడ ఈ వైరస్ కేసులు పెరుగుతున్న వేళ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు పాకిస్ధాన్ లో అధికారులు, ఇక్కడ అనేక కేసులు పెరుగుతున్నాయి, అయినా ప్రజల్లో మార్పు రావడం లేదు, దీంతో ఎలాగైనా మార్పు తీసుకురావాలి అని ప్రయత్నించారు సక్సెస్ అయ్యారు.

ఫైసలాబాద్ పోలీసులు ఓ కొత్త నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు కరెంటు షాక్ ఇస్తే అప్పుడు కచ్చితంగా మాస్క్ వాడతారని భావించిన పోలీసులు విదేశాల నుంచి కరెంట్ షాక్ ఇచ్చే ప్రత్యేక ఎలక్ట్రిక్ షాట్ గన్ పరికరాల్ని తెప్పించారు. అవి లాఠీల లాగా ఉంటాయి. బటన్ నొక్కి మనిషికి అంటిస్తే చాలు కరెంటు షాక్ కొడుతుంది. ఇలా రోడ్డుపై ఎవరైనా మాస్క్ లేకుండా కనిపిస్తే చాలు వెంటనే వీపుపై కాలు చేతులపై వడ్డిస్తున్నారు.

ఇక ఆ షాక్ కి పరుగులు పెట్టి మాస్క్ పెట్టుకుంటున్నారు, ఈ ఆలోచన చాలా బాగుంది అంటున్నారు అందరూ…దీంతో అందరూ బుద్ధిగా మాస్కులు ధరించి బయటకు వస్తున్నారు. ఇక పాక్ లో చాలా వరకూ మాస్క్ వాడకం బాగా పెరిగింది