చాలా మంది ఈ వైరస్ ని చాలా ఈజీగా తీసుకుంటున్నారు.. దీని వల్ల ఎలాంటి ప్రమాదమో తెలిసినా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు…ఇక చాలా మంది మాస్క్ పెట్టుకోవాలి అని చెబుతున్నా కొందరు వినిపించుకోవడం లేదు.
అంతేకాదు మీడియా సోషల్ మీడియాలో ఎంత ప్రచారం జరుగుతున్నా దానిని ఎవరూ పట్టించుకోవడం లేదు ఇక టిక్ టాక్ లో వీడియోలు చేసే ఓ బ్యూటీ తను కూడా మాస్క్ ఎందుకు అని అందం, తన గ్లామర్ కనిపించదు అని అంది.
కాని తన సిస్టర్ మ్యారేజ్ కు వెళ్లి వచ్చిన తర్వాత ఆమెకు దగ్గు జ్వరం వచ్చింది.. దీంతో ఆస్పత్రికి తీసుకువెళితే కరోనా అని తేల్చారు వైద్యులు. దీంతో ఇప్పుడు మాస్క్ పెట్టుకుని ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోందట.