ఫ్లాష్: హైదరాబాద్ లో భారీగా సీఐల బదిలీ

0
85

హైద‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో భారీగా సీఐల బదిలీలు జరిగాయి. ఒకేసారి 69 మంది సీఐల‌ను బ‌దిలీ చేస్తూ సీపీ సీవీ ఆనంద్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ప్రస్తుతం పంజాగుట్ట ఎస్‌హెచ్‌వోగా ఉన్న నిరంజన్‌రెడ్డిని సీసీఎస్‌కు బదిలీ చేశారు. నారాయణగూడ ఎస్‌హెచ్‌వోగా రాపోలు శ్రీనివాస్‌రెడ్డి, సైఫాబాద్‌ కె.సత్తయ్య, బేగంబజార్‌ ఎన్‌.శంకర్‌, శాలిబండ జి.కిషన్‌, మొగల్పుర శివకుమార్‌, ఆసిఫ్‌నగర్‌ శ్రీనివాస్‌, హబీబ్‌నగర్‌ శ్రీరామ్‌ సైదాబాబు, రాంగోపాల్‌పేట ఎస్‌హెచ్‌వోగా జి.లింగేశ్వరరావు నియమిస్తూ సీపీ ఆదేశాలు జారీ చేశారు.