గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

0
37

బంగారానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కొత్త ఏడాదిలో వరుసగా పెరుగుతూ పోయిన బంగారం ధరలు వెండి ధరలు ఇప్పుడు స్థిరంగా ఉన్నాయి. ఇక తాజాగా తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.

హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 104 తగ్గి రూ. 50, 950 గా నమోదు కాగా…అదే స‌మ‌యంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 రూ. 46, 700 గా ప‌లుకుతుంది.

ఇక వెండి ధ‌ర‌లు కూడా కాస్త తగ్గాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 800 తగ్గి రూ. 61, 700గా నమోదు అయింది.