దేశంలో పెరిగిన కరోనా కేసులు..తాజాగా ఎన్నంటే?

0
48

దేశంలో కరోనా మహమ్మారి పూర్తిగా తొలగిపోలేదు. ఇప్పటికే మూడు వేవ్ లుగా వచ్చిన మహమ్మారి ఎందరినో పొట్టన బెట్టుకుంది. ఇక కరోనా పోయిందనుకునే సమయానికి కేసుల సంఖ్య పెరుగుతుండడం ఇప్పుడు అందరిని కలచివేసింది. దీనితో అందరిలోనూ భయం నెలకొంది.

ఇక గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16,906 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో ఉన్న కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,32,457కి చేరింది. అయితే కరోనా యాక్టివ్ కేసుల రేటు 0.30 శాతం ఉందని.. రికవరీ రేటు 98.49 శాతంగా ఉందని అధికారులు వెల్లడించారు.

నిన్న ఒక్కరోజే 45 మంది వరకు కరోనా బారిన పడి మృత్యువాత పడ్డారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 5,25,519కి చేరిందని కేంద్రం వెల్లడించింది. కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.