మే 29 న వాతావరణంలో ఏం జరుగుతుంది? దేశంలో రెండు రికార్డులు

మే 29 న వాతావరణంలో ఏం జరుగుతుంది? దేశంలో రెండు రికార్డులు

0
105

ఈ వైరస్ ప్రభావంతో దేశం అంతా రెండు నెలలుగా లాక్ డౌన్ లో ఉంది, మరీ ముఖ్యంగా లాక్ డౌన్ వేళ ఎండలు కూడా విపరీతంగా ఉన్నాయి, ఎండల ప్రభావం గడిచిన వారం నుంచి దారుణంగా ఉంది.
వారం రోజులుగా ఎండలు దంచి కొడుతున్నాయి. రోడ్డెక్కేందుకు జనం గజగజ వణికిపోవాల్సిన పరిస్థితి.
ఇక ఏపీ తెలంగాణలో 47 డిగ్రీల సెల్సియస్ ఎండలు రికార్డవుతున్నాయి.

అయితే.. మే 29న వాతావరణంలో అనూహ్య మార్పు వస్తుందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. వేసవి వేడి కాస్త తగ్గే అవకాశం ఉంది అంటున్నారు, ఇక దేశంలో రికార్డు నమోదు అయింది ఈ ఎండ వేడికి.. రాజస్థాన్లోని చురు సమీపంలో ఏకంగా 50 డిగ్రీల సెల్సియస్ ఎండ వేడిమి రికార్డు
అయింది, ఇక ఢిల్లీలో పాలెంలో 47.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయ్యింది.

దీంతో ఎండలు ఏ రేంజ్ లోఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.పశ్చిమ రాజస్థాన్, మధ్యప్రదేశ్, దక్షిణ హర్యానా, ఢిల్లీ, దక్షిణ యూపీ, విదర్భ ప్రాంతాలకు తీవ్రమైన వేడిగాలుల హెచ్చరికలు జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఎప్పుడు చల్లని కబురు వర్షం వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.