మిడతలు దాడి చేయకుండా ఉండాలంటే ఇవి చేస్తే బెటర్

మిడతలు దాడి చేయకుండా ఉండాలంటే ఇవి చేస్తే బెటర్

0
37

మిడతల దండు మన దేశం పై అప్పుడే దాడి మొదలు పెట్టాయి, ఇప్పటికే పాక్ నుంచి రాజస్ధాన్ యూపీ మధ్యప్రదేశ్ ఇలా అన్ని రాష్ట్రాల్లో అక్కడ లక్షల హెక్టార్ల పంటలని నాశనం చేశాయి, ఇప్పుడు రెండు స్టేట్స్ కూడా అప్రమత్తం అయ్యాయి, ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెబుతున్నారు అధికారులు.

ఈ మిడతల దండు గంటకు 12-15 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుందని, ఇవి చెట్ల మీద ఆవాసం ఏర్పరుచుకొని పంటలకు భారీ నష్టం కలిగిస్తాయని చెప్పారు. గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్, మహారాష్ట్రలకు విస్తరించి.. ఇప్పుడు రాష్ట్రంలోకి వచ్చే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు, ఇళ్లపై పంటలపై ఎలా ఇవి కుప్పలుగా వస్తున్నాయో వీడియోలు కనిపిస్తున్నాయి.

మిడతలను పారదోలేందుకు ఖాళీ డబ్బాలు, ఎలక్ట్రానిక్ వస్తువులతో పెద్ద శబ్దాలు చేయాలి. ప్రతి 15 లీటర్ల నీటిలో 45 మిల్లీ లీటర్ల వేప నూనెను కలిపి పైరుపై చల్లాలి అని చెబుతున్నారు అధికారులు, రాత్రి సమయాల్లో రైతులు ఈ మిడతలు రాకుండా మంటలు కూడా కొన్ని చోట్ల ఏర్పాటు చేశారు.