ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిపై మెగాస్టార్ చిరు సంచలన కామెంట్స్

Megastar's sensational comments on Vice President Venkaiah Naidu

0
89

మెగాస్టార్ చిరంజీవి సంచలన కామెంట్స్ చేశారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. బుధవారం అమీర్ పేటలో యోధ డయోగ్నస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవానికి చిరు, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ… ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాష్ట్రపతి స్థాయికి ఎదగాలని తాను కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. ఇది ప్రతి తెలుగు వారి కోరిక అని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రపతిగా ఉన్న రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం వచ్చే సంవత్సరం జులై నాటికి పూర్తి కానున్న సంగతి తెలిసిందే.

2017లో భారత ప్రథమ పౌరుడిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో చిరంజీవి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.