బిగ్​బుల్​ ఝున్‌ఝున్‌వాలా నయా బిజినెస్..అదేంటో తెలుసా?

Big Bull Jhunjhunwala New Business..Did you know that?

0
36

ఆకాశ ఎయిర్​ పేరుతో విమాన రంగంలోకి బిగ్​బుల్​ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా అడుగుపెట్టారు. అందుకు గానూ భారత్​లో సర్వీసులు ప్రారంభించడం కోసం 72 బోయింగ్​ విమానాలను ఆర్డర్​ ఇచ్చారు. ఈ మేరకు ఆమెరికాకు చెందిన ఏరోస్పేస్ కంపెనీ బోయింగ్ నుంచి ‘737 మ్యాక్స్’ విమానాలను దిగుమతి చేసుకోనున్నారు.

బోయింగ్​లోని రెండు వేరియంట్లు అయిన 737-8తో పాటు అధిక-సామర్థ్యం కలిగి ఉండే 737-8-200లను ఆకాశ్​ ఎయిర్​ ఆర్డర్​ ఇచ్చిందని బోయింగ్​ తెలిపింది. ఇప్పటికే రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా సహా మరికొంత మంది కలిసి ఏర్పాటు చేసిన విమానయాన సంస్థ ‘ఆకాశ ఎయిర్‌’కు పౌరవిమానయాన శాఖ నుంచి ఎన్‌ఓసీ లభించింది. మరోవైపు దేశ స్టాక్ మార్కెట్ గురించి చర్చ వస్తే..రాకేశ్ ఝున్​ఝున్​వాలా​ గురించి తప్పకుండా మాట్లాడుకోవాల్సిందే. అంతలా ఆయనకు గుర్తింపు ఉంది. అందుకే ఆయన్ను అందరూ ‘బిగ్​బుల్​’గా పిలుస్తారు.

మార్కెట్​ డేటా ప్రకారం రాకేశ్​ ఝున్​ఝున్​వాలా ఫినాన్స్, టెక్, రిటైల్​, ఫార్మా రంగాల్లో అధికంగా పెట్టుబడులు పెట్టారు. ట్రెండ్​లైన్​ నివేదిక ప్రకారం ఆయనకు మొత్తం 36 స్టాక్స్​లో (కంపెనీలు) దాదాపు రూ.18,867 కోట్లు విలువైన పెట్టుబడులు ఉన్నాయి.