తగ్గేదేలే అంటున్న అక్కినేని హీరో..కారణం ఇదే!

Akkineni hero who says that he is declining..this is the reason!

0
32

అఖిల్ అక్కినేని ఇప్పుడు ఫుల్ జోష్‏లో ఉన్నాడు. చాలా కాలం తర్వాత అఖిల నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇదే ఊపులో అఖిల్ తన తదుపరి చిత్రాలపై మరింత ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అఖిల్.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అఖిల్ లుక్ తెగ ఆకట్టుకుంది.

స్పై థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీలోని పలు కీలకమైన సన్నివేశాలను విశాఖపట్నం, కృష్ణపట్నం పోర్టులలో చిత్రీకరిస్తున్నారు. అలాగే గత కొద్ది రోజులుగా ఈ సినిమా యూరప్ లోని బడా ఫెస్ట్ లో మేజర్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది.

తాజాగా ఈ మేజర్ షెడ్యూల్ షూటింగ్‏ను పూర్తి చేసింది చిత్రయూనిట్. ఇక తదుపరి షెడ్యూల్ ను హైద్రాబాద్ లో ప్లాన్ చేశారట. దీంతో ఇక్కడే చాలావరకు షూటింగ్ పూర్తి అవుతుందని అంటున్నారు. ఇందులో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుండగా.. అతుల్య రవి సెకండ్ హీరోయిన్ గా కనిపించనుంది. అలాగే ఇందులో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు.