‘ధరణి పోర్టల్ ను అడ్డంపెట్టుకుని అవుటర్ రింగ్ చుట్టూ లక్షలాది ఎకరాలు గోల్ మాల్’

0
72

టీపీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. సమయం దొరికినప్పుడల్లా టిఆర్ఎస్ సర్కార్ పై మండిపడుతూనే ఉన్నారు. తాజాగా సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. వందలాది ఆత్మబలిదానాలతో తెలంగాణ సాధించుకున్నాం. సీఎం కేసీఆర్.. 2008 ఒక టీవీ ఇంటర్వ్యూలో తమ పూర్వీకులు బీహార్ నుంచి వచ్చారని చెప్పారు. ఎనిమిదేళ్లలో తెలంగాణ పౌరులకు పరిపాలనలో అవకాశాలు ఇవ్వడం లేదు. సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ అంజనీ కుమార్ తో బీహార్ ఐఏఎస్ లకు ఒక్కొక్కరి వద్ద ఆరు శాఖలు ఇచ్చారు. బీహార్ ఐఏఎస్ లను ఒక రక్షణ వలయంగా ఏర్పాటు చేసుకొని పరిపాలన చేస్తుండు.

తెలంగాణ ప్రాంత అధికారుల తీరు ప్రశ్నార్థకంగా మారింది. నేను చేసిన కామెంట్స్ కు రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సింది పోయి.. మళ్లీ బీహార్ వ్యక్తులు రంగంలోకి దిగారు. బీహార్ మంత్రి సంజయ్ కుమార్ ఝా అనే మంత్రి కేసీఆర్ ను సమర్థిస్తూ నన్ను విమర్శిస్తుండు. ధరణి పోర్టల్ దేశానికే ఆదర్శమని సీఎం కేసీఆర్ పదే పదే చెబుతూ వచ్చారు. ధరణి కారణంగా భూతగాదాలతో హత్యలకు దిగుతున్నారు. నిన్న ఇబ్రహీంపట్నంలో ఇద్దరు మర్డర్లు ధరణి లోపాల వల్లే జరిగాయని ఆరోపించారు.భూముల అమ్మకం జరిగిన తర్వాత.. మళ్లీ ధరణిలో ప్రత్యక్షం కావడం మళ్లీ అమ్మకాలు జరుగుతున్నాయి.

సీఎస్ సోమేశ్ కుమార్ తీరుతో ధరణి లోపభూయిష్టంగా మారింది. ధరణి పోర్టల్ ను అడ్డంపెట్టుకుని అవుటర్ రింగ్ చుట్టూ లక్షలాది ఎకరాలు గోల్ మాల్ అయ్యింది. బీహార్ ఐఏఎస్ ముటా కారణంగా తెలంగాణ సమాజం ఇబ్బందులు ఎదుర్కొంటుంది. సీఎం కేసీఆర్ ను అడుగుతున్న.. మీ పూర్వికులు బీహార్ కావొచ్చు.. పరిపాలన మొత్తం బీహార్ బ్యాచ్ కేనా.. 152 మంది ఐఏఎస్ లలో కేవలం బీహార్ ఐఏఎస్ లే ప్రతిభావంతులా..సీఎస్ సోమేశ్ కుమార్.. ఐఏఎస్ సర్వీస్ లో ఏడేళ్లు పని చేయలేదు.సోమేశ్ కుమార్ సీనియారిటీ ప్రకారం ప్రిన్సిపల్ సెక్రటరీకే పరిమితం కానీ సీఎస్ గా బాధ్యతలు ఇచ్చారు. విభజన సందర్భంగా ఏపీ క్యాడర్ కు సోమేశ్ కుమార్ ను కేటాయించారు.

డీవోపీటీలో కేసు ఉంటే బెంచ్ మీదకు రాకుండా మేనేజ్ చేస్తున్నారు. ఐదేళ్లు పూర్తవుతున్న కేసు బెంచ్ మీదకు రావడం లేదు. జయేష్ రంజన్ , అరంవింద్ కుమార్ , సందీప్ కుమార్ సుల్తానియా , రజత్ కుమార్ వీరందరూ బీహార్ కు చెందిన ఐఏఎస్ లు ఒక ముఠాగా ఏర్పడ్డారు. గ్రేటర్ ఎన్నికల్లో 30 లక్షల ఓట్లను సోమేశ్ కుమార్ తొలగించారు. నజరానా గా సీఎస్ పోస్ట్.. రజత్ కుమార్.. జనరల్ ఎన్నికల్లో అవకతవకలకు సహకరించినందుకు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రకరీ ఇచ్చారు. అరవింద్ కుమార్ చేస్తున్న అక్రమాలు అన్నీ ఇన్నీ కావు.. ఈయనకు ఆరు శాఖలు ఇచ్చారు. ఐపీఎస్ అంజనీ కుమార్ కూడా బీహార్ బ్యాచ్.. డీజీపీ మహేందర్ రెడ్డి ని ఉన్న ఫలంగా పంపించి.. బీహార్ బ్యాచ్ అంజనీ కుమార్ ను తీసుకొచ్చారు.

రాష్ట్రం మొత్తం బీహారీల చేతిలో బంధి చేశారు. పరిపాలనలో బీహారీల తప్పుడు విధానాల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్ కూడా బీహార్ బ్యాచ్.. బీహార్ ఐఏఎస్ లపై నిఘా పెట్టాలి. నేను ఇవన్నీ బయట పెడితే.. రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సింది పోయి.. బీహార్ మంత్రి నన్ను విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణ కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మాట్లాడాలి. చైతన్య వంతమైన తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. బీజేపీ నేతలు బండి సంజయ్ , కిషన్ రెడ్డి లు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు.. ముందు ఏపీ క్యాడర్ అధికారులను పంపించే చర్యలు తీసుకోవాలి. కేంద్రం పరిధిలోని అడిషనల్ సొలిసిటర్ జనరల్ కేసులను ఎందుకు వాధించడం లేదు. తెలంగాణ సమాజం వీటన్నింటినీ గుర్తించాలని రేవంత్ రెడ్డి కోరారు.